SIRపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపు!

CEC జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRను ఆపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. SIRలో అన్యాయంగా తొలగించిన అర్హుల ఓట్లను తిరిగి చేర్చాలని కోరాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రధాని, ప్రతిపక్షనేత, సీజేఐతో కూడిన కమిటీ ఉండాలని సూచించాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని ఎం.ఏ.బేబీ, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.



