రాత్రిపూట పాలు తాగితే నిద్ర పట్టడం ఎలా?

రాత్రిపూట పాలు తాగితే నిద్ర పడుతుంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో తెలుసా? పాలలో ట్రిప్టోఫాన్ అనే Amino acid ఉంటుంది. ఇది మెదడులోకి వెళ్లి Serotonin, Melatonin హార్మోన్ల ఉత్పత్తికి సాయపడుతుంది. ఇవి మనసును ప్రశాంతపరుస్తాయి, నిద్రను ప్రేరేపిస్తాయి. గోరువెచ్చని పాలు తాగడం వల్ల శరీరం లోపలి నుండి వేడెక్కి, కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో ఒత్తిడి తగ్గి నిద్ర త్వరగా రావడానికి సాయపడుతుంది. పాలు తాగడం మానసిక సాంత్వననిచ్చి నిద్ర వచ్చేలా చేస్తుంది.



