← Back to news

100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్..

By Nani Eluri· 1h ago· Asianetnews
100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్..

తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో 137 కిలోల క్రిస్టల్ మెత్ డ్రగ్స్‌ను DRI అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ 100 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్‌ను సముద్ర మార్గంలో శ్రీలంకకు తరలించేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నిందితుల దగ్గర 10 లక్షల రూపాయల నగదుతో పాటు రెండు కార్లు, ఒక బైక్‌ను కూడా సీజ్ చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుంటున్నారు.

More in National