రైలు ఢీకొని వృద్ధుడు మృతి

ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందారు. మృతుడు ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లికి చెందిన గోపిన సత్తిరాజు (78)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ట్రాక్ మెన్ తెలిపారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



