మినీ ట్యాంక్‌బండ్‌లో బోటింగ్ ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌లో బోటింగ్ సౌకర్యాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈరోజు నుంచి ప్రతి శనివారం ప్రజలు బోటింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, తిరుమల యాదవ్, గోవింద శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


