← Back to news

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు CISF గుడ్‌బై.. కేంద్రం సంచలన నిర్ణయం

By Mahesh· 22 Aug 2026· విశాఖపట్నం
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు CISF గుడ్‌బై.. కేంద్రం సంచలన నిర్ణయం

AP: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ నుంచి CISF సర్వీసుల రద్దుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తం 1,331 CISF పోస్టులు వెనక్కి తీసుకోనున్నారు. ఇందులో 1,033 సెక్యూరిటీ వింగ్, 298 ఫైర్ వింగ్ పోస్టులు ఉన్నాయి. మూడు నెలల నోటీస్ తర్వాత నవంబర్ 17న పూర్తిగా రద్దు కానుంది. RINL ఇవ్వాల్సిన పెండింగ్ డ్యూస్‌ను కూడా క్లియర్ చేయాలని కేంద్రం ఆదేశించింది. స్టీల్ ప్లాంట్‌కు రక్షణగా ఉన్న CISFను రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆర్డర్స్ ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి.

More in AP