ఉంగ్లీ తో ఉఠేగీ..హల్లాబోల్ మార్చ్
ఢిల్లీలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI ఈ రోజు ‘ఉంగ్లీ తో ఉఠేగీ – హల్లాబోల్ పేరుతో మార్చ్’ నిర్వహించింది.న్యూఢిల్లీలోని NSUI జాతీయ కార్యాలయం నుంచి జంతర్ మంతర్ వైపు మార్చ్ చేపట్టింది. నిరసనలో పాల్గొన్న విద్యార్థులు తమ వేళ్లపై గాయం అయినట్లు కట్టు కట్టుకొని వేళ్లను చూపిస్తూ ‘ఉంగ్లీ తో ఉఠేగీ’ అంటూ నినాదాలు చేశారు. అంటే, ఓటర్ల హక్కుల విషయంలో ప్రశ్నలు అడుగుతూనే ఉంటామని చెప్పడం ఈ నినాదం ఉద్దేశం.



