← Back to news

కారుతో ATM చోరీ.. (VIDEO)

By Krishna· 7 Oct 2026

ఇదివరకు దొంగలు.. ATM కేంద్రంలోకి వెళ్లి.. గ్యాస్ కట్టర్‌తో కియోస్క్‌ని ముక్కలు చేసేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు దొంగలు కూడా అప్‌గ్రేడ్ అయ్యారు. శ్రమ లేకుండా చోరీ చేస్తున్నారు. జార్ఖండ్.. దేవగఢ్‌లో ఓ బలమైన తాడును ATM కియోస్క్‌కి కట్టి.. దాన్ని కారుకు కట్టి.. కారును ముందుకు పోనిచ్చారు. దాంతో.. కియోస్క్ మొత్తంగా ఊడొచ్చేసింది. దాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ పట్టుకుపోయారు. ఇదంతా CCTV కెమెరాలో రికార్డైంది. పోలీసులు ఆ దొంగల కోసం వెతుకుతున్నారు.

More in Viral