← Back to news

విద్యార్థులకు రెండో టీచర్‌ AI

By A.Ajay· 5 Oct 2026
విద్యార్థులకు రెండో టీచర్‌ AI

చదువులో డౌట్ వస్తే విద్యార్థులు టీచర్లను అడగడంతో పాటు ఇప్పుడు ChatGPT, Gemini వంటి AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. హోంవర్క్‌, డౌట్స్, అదనపు సమాచారం కోసం ఇవి వెంటనే సమాధానాలు ఇస్తున్నాయి. అయితే AI ఇచ్చిన జవాబును అలాగే రాసేయడం వల్ల విషయం నిజంగా అర్థమయ్యే అవకాశం తగ్గుతుంది. పైగా AI కొన్నిసార్లు తప్పు సమాచారాన్ని కూడా ఇవ్వొచ్చు. అందుకే AIని చదువుకు సాయం చేసుకునే సాధనంగా ఉపయోగించుకోవాలని, దాని జవాబులను పరిశీలిస్తూ సొంతంగా ఆలోచించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

More in Infotainment