← Back to news

దళితుల జీవితాల బాధలను ‘మూక’ ఆవిష్కరిస్తుంది

By Lokesh· 1h ago· Hyderabad
దళితుల జీవితాల బాధలను ‘మూక’ ఆవిష్కరిస్తుంది

ఛాయ ప్రచురణలో శరత్ కుమార్ లింగర్ రాసిన ‘మూక’ నవల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కవయిత్రి మెర్సీ మార్గరెట్ మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లోని కష్టాలు, బాధలను దళితులు మాత్రమే లోతుగా అనుభవించి రాయగలరన్నారు. కుల వ్యవస్థ వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ‘మూక’లో స్పష్టంగా చూపించారని తెలిపారు. ఆనంద్ ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కులం పేరుతో ఎదుర్కొన్న వేధింపులను నవల వివరిస్తుందన్నారు. వ్యక్తులు కలిసినప్పుడు జరిగే పరిణామాలను కూడా రచయిత ప్రస్తావించారని పేర్కొన్నారు.

More in Current Affairs

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్
Current Affairs· 5h ago

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఈజీగా యాక్సెస్ చేస్తుండటంతో.. వారికి సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి మైనర్లను ఎలా కాపాడతారో చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిటిషన్‌పై విచారణలో ఈ కామెంట్స్ చేసింది. ఆటో కంటెంట్ ఫిల్టర్లు, ఏజ్ వెరిఫికేషన్ ఉండాలని పిటిషనర్లు కోరారు. అల్గారిథమ్స్ పిల్లలకు ఏజ్‌కు మించిన కంటెంట్ చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.