Love పేరుతో Honey Trap!
సోషల్ మీడియాలో లవ్, ఫ్రెండ్‌షిప్ పేరుతో పరిచయం పెంచుకుని.. డబ్బులు అడిగే మోసాలను Honey Trap Cyber Fraud అంటారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. పర్సనల్ ఫొటోలు, వీడియోలను బయటపెడతామని బెదిరిస్తే దాన్ని Sextortion అంటారని ఓ అలర్ట్ వీడియో రిలీజ్ చేశారు. Fake Profile, హ్యాక్ అయిన అకౌంట్ లేదా తెలిసిన వ్యక్తి ద్వారా కూడా ఈ మోసం జరగొచ్చు. తెలియని వారితో పర్సనల్ డీటైల్స్ షేర్ చేసుకోవద్దు. ఫ్రాడ్ జరిగితే వెంటనే 1930కి కాల్ చేయండి.



