68 ఏళ్లుగా జుట్టు కత్తిరించలేదు.. కడగలేదు
వియత్నాంలోని బెన్ ట్రే ప్రావిన్స్‌కు చెందిన 87 ఏళ్ల వృద్ధ మహిళ న్గుయెన్ తి డింహ్ 68 ఏళ్లుగా తన జుట్టు కత్తిరించకుండా, కడుక్కోకుండా జీవిస్తోంది. ఆమె జుట్టు ప్రస్తుతం 6.2 మీటర్ల పొడవు ఉంది. ఇది ఒక భారీ పైథాన్ పాములగా దట్టంగా చుట్టుకుపోయి ఉంది. 19 ఏళ్ల వయసులో మొదటిసారి జుట్టు కత్తిరించిన తర్వాత తలనొప్పులు, అనారోగ్యం వచ్చాయి. జుట్టు పెరిగినప్పుడు లక్షణాలు తగ్గాయి. దీంతో ఆమె జుట్టును కత్తిరించడం, తలస్నానం చేయడం ఆపేసింది.
