గోవా ప్రజలది.. అమ్మకానికి కాదు: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఈ రోజు గోవాలోని మార్గావ్లో కాంగ్రెస్ నిర్వహించిన 27 రోజుల ‘గోయ్ రాఖోన్న్’ (గోవాను కాపాడండి) యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఈ యాత్ర గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. రాష్ట్ర భూములు, గోయెంకర్పొన్ గుర్తింపు, పర్యావరణం, సంస్కృతిని కాపాడటంతో పాటు భూముల మార్పిడి, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలను కాంగ్రెస్ లేవనెత్తింది. “గోవా ప్రజలదే.. అమ్మకానికి కాదు” అని రాహుల్ గాంధీ అన్నారు.


