మేస్త్రి దగ్గరకు కారు రిపేర్: సిమెంట్, ఇటుకలతో అతికించేశారు!
సోషల్ మీడియాలో ఒక వెరైటీ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా కారు బాడీ డ్యామేజ్ అయితే మెకానిక్ షెడ్ కి వెళ్తాం, కానీ ఒక వ్యక్తి మాత్రం తాపీ మేస్త్రి దగ్గరకు వెళ్లాడు. ఆ మేస్త్రి ఇటుకలు, సిమెంట్‌తో కారు వెనుక భాగాన్ని రిపేర్ చేయడం నెటిజన్లను షాక్ కి గురిచేస్తోంది. షోరూమ్ వాళ్లు ఎక్కువ డబ్బులు అడిగితే, మేస్త్రి ఓన్లీ రూ. 200కే పని పూర్తి చేశాడు, ఇంకా ఈ వీడియో కింద ఇలాంటి ఐడియాస్ మన ఇండియన్స్ కే వస్తాయని క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి.



