← Back to news

గాజువాకలో వినాయక మండపం వివాదం

By Vishi· 4h ago

AP: విశాఖపట్నం జిల్లా గాజువాక శ్రీనగర్‌లోని కోటి గాజుల వినాయక(దివ్య కంకణ అలంకార మహా గణపతి) మండపం వివాదంలో చిక్కుకుంది. జనంగా భారీగా రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందంటూ పోలీసులు స్టాళ్లు, యమలోకం సెట్‌ను తొలగించాలని కోరారు. విగ్రహాన్ని ఉంచి, పందిరి చుట్టూ ఏర్పాటు చేసిన స్టాళ్లు, 'యమలోకం' థీమ్ సెట్‌ తొలగించాలని పోలీసులు కోరారు. భక్తుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతుంటే, గణపతి ఉత్సవాలపైనే ఇలాంటి రూల్స్ ఎందుకు పెడుతున్నారంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది.

More in AP