గ్రామంలో కాలువల పూడిక తొలగింపు

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశారు. గ్రామంలోని ప్రధాన, మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు. రహదారుల పక్కన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించారు. జేసీబీలు, ఎక్స్కవేటర్ల సాయంతో ప్రధాన, అంతర్గత రహదారులను శుభ్రం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే పనులు చేపట్టారు.



