← Back to news

రోదసిలో డేటా సెంటర్!

By A.Ajay· 29 Sept 2026
రోదసిలో డేటా సెంటర్!

అంతరిక్షంలో డేటాను ప్రాసెస్ చేసే కొత్త ప్రయత్నానికి హైదరాబాద్‌కు చెందిన టేక్‌మీ2స్పేస్ సిద్ధమవుతోంది. సంస్థ రూపొందించిన MOI-1A ఉపగ్రహాన్ని స్పేస్‌ఎక్స్ ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా అక్టోబర్‌ 1న రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉపగ్రహంలోనే డేటాను విశ్లేషించి ఫలితాలను భూమికి పంపడం దీని ప్రత్యేకత. ఈ ఏడాదిలో మరో ప్రయోగానికి కూడా సంస్థ సిద్ధమవుతోంది. 2028లో రెండు పెద్ద ఉపగ్రహాలను పంపి ఆర్బిటల్ డేటా సెంటర్ వ్యవస్థను మరింత విస్తరించాలని యోచిస్తోంది.

More in Technology