పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో MP LADS అభివృద్ధి పనులపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో MP LADS నిధులతో చేపట్టిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్, R&B, మిషన్ భగీరథ, TGIDC శాఖల పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇప్పటికే పురోగతిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.



