← Back to news

3 నెలలుగా చీకట్లోనే ఆదివాసీ గ్రామం.. కొవ్వొత్తులతో నిరసన

By Mahesh· 24 Aug 2026· AP
3 నెలలుగా చీకట్లోనే ఆదివాసీ గ్రామం.. కొవ్వొత్తులతో నిరసన

AP: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని వెదుళ్లువలస ST గదబ PVTG ఆదివాసీ గ్రామం మూడు నెలలుగా వీధి లైట్లు లేక చీకట్లోనే ఉంది. రాత్రివేళల్లో పాములు, జెర్రులు వంటి విషపురుగుల వస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. తమ ప్రాణాలకు సేఫ్టీ లేకుండా పోయిందని మహిళలు, గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలని కొవ్వొత్తులతో ర్యాలీ చేసి తమ నిరసనలు తెలిపారు. ఎలక్ట్రిసిటీ బిల్స్, డిమాండ్ నోటీసుల విషయంలో పంచాయతీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారుల మధ్య కోఆర్డినేషన్ లోపమే కారణమని ఆరోపించారు.

More in AP