రీల్స్ ఆఫర్ అని పిలిచి బ్లాక్‌మెయిల్

విజయవాడలో ప్రమోషన్ రీల్స్ చేస్తే ₹30 వేలు ఇస్తానని నమ్మించి కడపకు చెందిన ఓ మహిళా యాంకర్‌ను మంగళగిరిలోని లాడ్జికి రప్పించాడు షేక్ జానీ అనే వ్యక్తి. నీళ్లలో మత్తు మందు కలిపి ఇచ్చి, స్పృహ లేని టైమ్‌లో అశ్లీల ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని వైరల్ చేస్తానని బెదిరించి ఆమె దగ్గర ₹15,800 గూగుల్ పే చేయించుకున్నాడు. రూమ్‌కి తాళం వేసి పారిపోగా, బాధితురాలి కంప్లైంట్ తో మంగళగిరి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.



