లిక్కర్ షాప్‌లో కోతి.. వీడియో వైరల్!
జార్ఖండ్‌లోని రాంచీలో ఓ కోతి ఏకంగా లిక్కర్ షాప్‌లోకి ఎంటరైంది. ఓ బాటిల్‌లోని మద్యం తాగిన తర్వాత అక్కడే హాయిగా నిద్రలోకి జారుకుంది. ఓర్మాంజీ ప్రాంతంలోని బ్లాక్ చౌక్‌లో జరిగిన ఈ ఘటనతో షాప్ సిబ్బంది షాక్ అయ్యారు. విషయం తెలియడంతో రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని కోతిని సేఫ్‌గా బయటకు తీసేందుకు ప్రయత్నించింది. ఈ సీన్‌ను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
