వైద్యం కోసం వస్తే అవస్థలే

TG: కడుపునొప్పికి వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన లక్ష్మయ్యకు నిరాశ ఎదురైంది. మధ్యాహ్నం 12:45 గంటలకు వచ్చినా రెండు గంటలపాటు ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆవేదన చెందారు. డబ్బులు ఇస్తే త్వరగా టెస్టులు చేస్తామని కొందరు సిబ్బంది అంటున్నారని చెప్పారు. చేవెళ్ల నుంచి మెరుగైన వైద్యం కోసం వచ్చామని, పైకి, కిందికి తిప్పుతున్నారని తెలిపారు. రోగులకు సకాలంలో వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


