ఖైరతాబాద్ వినాయకుడి తొలి హారతి (వీడియో)
వినాయక చవితి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తొలి హారతి సమర్పించారు. వర్షాలు, పంటల సమృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం ప్రార్థించారు. ఉదయం నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బడా గణేశ్‌ని దర్శించుకుని, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తున్న పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో స్వామి దర్శనమిస్తున్నారు.


