సాయం చేయబోయి.. పెద్ద తప్పు చేశారు!
మధ్యప్రదేశ్‌లో ఓ టీచర్ ఎండ ఎక్కువగా ఉండటంతో స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా తల తిరిగి కిందపడిపోయింది. అది చూసిన ఇద్దరు యువకులు గుండెపోటు వచ్చిందనుకుని వెంటనే CPR ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ డాక్టర్లు చెక్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఆమెకు గుండెపోటు రాలేదని, ఎండ వల్లే స్పృహ తప్పిందని చెప్పారు. పైగా అవసరం లేకుండా చేసిన CPR వల్ల రెండు పక్కటెముకలు విరిగినట్లు తెలిపారు. అందుకే ఎవరైనా పడిపోతే వెంటనే CPR చేయడం కాదు.. ముందు అసలు పరిస్థితి ఏంటో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.



