← Back to news

తెలుగు ప్రజలు నన్ను అమ్మలా ఆదరిస్తున్నారు: K.S. చిత్ర

By A.Ajay· 29 Sept 2026
తెలుగు ప్రజలు నన్ను అమ్మలా ఆదరిస్తున్నారు: K.S. చిత్ర

ప్రముఖ గాయని చిత్ర HYDలో నవంబర్‌ 21న ‘చిత్రామృతం 3.0’ సంగీత కచేరీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలు తనపై చూపించే అభిమానం ప్రత్యేకమని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా తనను అమ్మలా ఆదరిస్తున్నారని తెలిపారు. స్టేజ్‌పై పాట పాడే ముందు పాటలో భావాన్ని ప్రేక్షకులకు చేరేలా పాడాలని చెప్పారు. ప్రతిరోజూ సాధన చేయడం, అహంకారం లేకుండా ఉండడం ముఖ్యమని పేర్కొన్నారు. సంగీత ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ప్రేక్షకుల ప్రేమే బలమని చిత్ర తెలిపారు.

More in Entertainment