ఇక నుంచి వారికి నో చెక్ పవర్!

నాగర్కర్నూల్ జిల్లాలో ప్రజాప్రతినిధులపై కలెక్టర్ కొరడా ఝళిపించారు. నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిధుల వినియోగంలో అవకతవకలకు పాల్పడిన సర్పంచులపై చర్యలు తీసుకున్నారు. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, పెంట్లవెల్లి మండలం పెంట్లవెల్లి, బిజినపల్లి మండలం కారుకొండ గ్రామాల సర్పంచుల చెక్ పవర్ను రద్దు చేశారు. కోడేరు మండలం ఎత్తం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లను సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.



