ఇక భగ్గుమనే ఎండలు

AP, తెలంగాణలో మళ్లీ ఎండలు మండుతున్నాయి. ఇవాళ గురువారం APలో 36 డిగ్రీల సెల్సియస్, తెలంగాణలో 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎక్కడా వర్షం పడే ఛాన్స్ లేదు. గాలి వేగం గంటకు 10 కిలోమీటర్లు లోపే ఉంటుంది. బయటి పనులకు వెళ్లేవారికి వాతావరణం ఇబ్బందిగా ఉంటుంది. తరచూ నీరు తాగాలి. గాలి దిశ మారింది. ఉత్తరం నుంచి దక్షిణానికి గాలులు వస్తున్నాయి. నైరుతీ రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే సగం ఇండియా నుంచి వెళ్లిపోయాయి. ఇవాళ్టి నుంచి AP, తెలంగాణలో కూడా ఈ పరిస్థితి ఉంటుంది.



