194 ఏళ్ళు బతికింది.. DNAలో ఏముంది?

ప్రపంచంలోనే అత్యంత వయసున్న భూచర ప్రాణిగా గుర్తింపు పొందిన జొనాథన్ అనే తాబేలుపై సైంటిస్టులు జన్యు పరిశోధనలు చేశారు. సుమారు 194 ఏళ్ల వయసున్న ఈ తాబేలు.. సౌత్ అట్లాంటిక్‌లోని సెయింట్ హెలెనా దీవిలో నివసిస్తోంది. దీని DNAలో కణాలను రిపేర్ చేసే వ్యవస్థ ఉంది అనీ, క్యాన్సర్‌ను అడ్డుకునే లక్షణాలు ఉన్నాయనీ సైంటిస్టులు గుర్తించారు. ఈ వివరాలు లాంగ్ లైఫ్ స్పాన్ వెనుక ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని సైంటిస్టులు తెలిపారు.



