మోదీ భయపడుతున్నారా: ప్రకాశ్ రాజ్

కేరళలోని కోజికోడ్‌లోని ఓ కార్యక్రమంలో నటుడు ప్రకాశ్ రాజ్ PM మోది, HM అమిత్ షా పై తీవ్ర విమర్శలు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ శక్తితో, మహాత్మా గాంధీ తరహాలో శాంతియుత నిరసనలతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి మిమ్మల్ని గద్దె దించుతాం అని ఘాటుగా స్పందించారు. భగత్ సింగ్ తరహాలో గట్టిగా పోరాడతామని కామెంట్ చేశారు. “Jab jab Modi darta hai, police ko aage karta hai” (మోదీ భయపడినప్పుడల్లా పోలీసులను ముందుకు నెడతారు) అని ఆయన అన్నారు.


