ఇంట్లో అద్దెకు దిగాలంటే 4 లక్షలు డిపాజిట్ ఏంటి!

బెంగళూరులో ఓ ఉద్యోగి షేర్ చేసిన అద్దె ఇంటి అనుభవం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తన ఆఫీసుకు నడిచి వెళ్లే దూరంలో ఉన్న 2BHK ఫ్లాట్‌కు నెలకు 70 వేలు అద్దె, 3-4 లక్షల డిపాజిట్ అడిగారని ఆయన తెలిపారు. ఫ్లాట్‌ను ఫుల్లీ ఫర్నిష్డ్‌గా చెప్పినా ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, డైనింగ్ టేబుల్, రెండో గదిలో బెడ్ లేవన్నారు. తాను 65 వేలు, 3 నెలల డిపాజిట్‌కి ప్రతిపాదించినా యజమాని అంగీకరించలేదని చెప్పారు. దీంతో ఆ ఫ్లాట్‌ను తీసుకోలేదని ఆయన తెలిపారు. మరి మీ కామెంట్ ఏంటి?
