మామ మర్మాంగం కోసిన కోడలు
చాలాకాలంగా తనను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్న మామపై ఓ కోడలు తన ప్రతాపం చూపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 23 ఏళ్ల మహిళ మామ మర్మాంగాన్ని కోసేసింది. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మహిళను అదుపులోకి తీసుకున్నారు. వేధింపులు విషయం తన భర్తకు చెప్పినా పట్టించుకోలేదని, అందుకే ఈ పని చేశానని చెప్పింది.



