← Back to news

అర్ధరాత్రి రైల్లో మహిళకు అవమానం..భారీ ఫైన్

By Prashanth· 7h ago
అర్ధరాత్రి రైల్లో మహిళకు అవమానం..భారీ ఫైన్

రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఓ మహిళను అర్ధరాత్రి రైలు నుంచి దించేయడంపై కేరళ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆమెకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. కమిషన్‌ చైర్‌పర్సన్ జస్టిస్ అలెగ్జాండర్ థామస్ జీవో జారీ చేశారు. టికెట్‌ లేదంటూ RPF కేసు నమోదు చేయగా, తప్పుగా కేసు పెట్టినట్లు గుర్తించి రైల్వే అధికారులు కేసు ఉపసంహరించుకున్నారు. మహిళను రాత్రివేళ దించడం రైల్వే రూల్స్‌కి విరుద్ధమని థామస్‌ అన్నారు. నెలలోపు పరిహారం చెల్లించాలని, ఆలస్యమైతే 8 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించారు.

More in Current Affairs