← Back to news

ఫ్రెంచ్‌ కాలం నాటి గేమ్..ఇప్పటికీ క్రేజ్‌

By Sharmila· 10 Oct 2026· Indiatimes
ఫ్రెంచ్‌ కాలం నాటి గేమ్..ఇప్పటికీ క్రేజ్‌

పుదుచ్చేరిలో ఫ్రాన్స్‌ కాలం నుంచి కొనసాగుతున్న పెటాంక్‌ ఆటకు ఇప్పటికీ ఆదరణ పెరుగుతూనే ఉంది. బౌల్స్‌ అని కూడా పిలిచే ఈ ఆటను గతంలో చర్చిలు, ఆటస్థలాలు, రోడ్ల పక్కన ఆడేవారు. ప్రపంచ యుద్ధాల టైంలో ఫ్రెంచ్‌ సైన్యంలో పనిచేసిన వారు ఈ ఆటను పరిచయం చేశారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో 28 క్లబ్‌లు ఈ ఆటను ప్రోత్సహిస్తూ, క్రమం తప్పకుండా టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు సరదా ఆటగా ఉన్న పెటాంక్‌ గేమ్ ఇప్పుడు పోటీ క్రీడగా మారింది.

More in Infotainment