‘చుట్టమల్లే’ Morphed వీడియోపై NTR ఫైర్!

Junior NTR తన <a href="https://x.com/tarak9999/status/2106292261843820830">'X'లో</a> AI మిస్‌యూజ్‌పై ఫైర్ అయ్యారు. ఓ మహిళను అవమానించేలా AIతో మార్ఫ్ చేసిన ‘చుట్టమల్లే’ వీడియోను చేసి, షేర్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకునేలా చూస్తానని హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ చూడటం, షేర్ చేయడం లేదా ఎంగేజ్ అవ్వడం చేయొద్దని కోరారు. రేపు ఇదే పరిస్థితి మన తల్లి, చెల్లి, భార్య లేదా కూతురుకు రావొచ్చని అన్నారు. AI మిస్‌యూజ్‌ను కంట్రోల్ చేసేందుకు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

