← Back to news

నా నమ్మకం బలుపా? హేటర్స్‌కు విజయ్ సూటి ప్రశ్న!

By Anusha· 9 Oct 2026· X

సమాజం చేసే విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్‌కు చెప్పారు. తన కష్టాన్ని తక్కువగా చూసినా, నిజాయతీని అహంకారంగా భావించినా వెనక్కి తగ్గనని అన్నారు. ‘రణబాలి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన వీడియోను ఫ్యాన్ క్లబ్ షేర్ చేసింది. ట్రైలర్‌లో విజయ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమా ఆయనకు మంచి కమ్‌బ్యాక్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్, రష్మిక నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదల కానుంది.

More in Entertainment