హోటల్ కాదు.. ఇల్లే! హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్

హైదరాబాద్‌లో ‘హోటల్.. హోమ్’ కల్చర్ ట్రెండ్ పెరుగుతోంది. రోజులు, నెలల తరబడి ఉండేవారు కూడా స్టార్ హోటళ్లలోని సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లను చూస్ చేసుకుంటున్నారు. వాషింగ్ మెషీన్, డిష్‌వాషర్, కిచెన్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐటీ, ఫార్మా, డేటా సెంటర్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి వీటికి డిమాండ్ పెరుగుతోంది. సిటీలో కొత్తగా 42 అపార్ట్‌మెంట్లతో కలిపి మొత్తం సంఖ్య 98కి చేరింది. వీటి రేట్లు రోజుకు రూ.10 వేల - 20 వేల వరకు ఉన్నా.. హోమ్, హోటల్ సర్వీసులు ఒకేచోట ఉండటంతో క్రేజ్ పెరుగుతోంది.



