సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు 15,004 ఈ-సైకిళ్లు ఇచ్చే ప్లాన్‌లో ఉంది కూటమి ప్రభుత్వం. ఈ సైకిళ్ల కోసం ₹45 కోట్ల బడ్జెట్ మంజూరు చెయ్యాలని కోరుతూ ఫైల్ తెరిచినట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఐతే.. ఈ రిక్వెస్ట్ ఈ సంవత్సరం మే నెల నుంచి ఉంది. ఫీల్డ్ విజిట్‌కి వెళ్లేటప్పుడు ఉద్యోగులు నడవాల్సి వస్తోంది. టైమ్ వేస్టవుతోంది. అందుకే ఈ-సైకిల్స్ ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఈ రిక్వెస్టు ఫైల్ తెరిచారు కాబట్టి.. త్వరలో ఈ-సైకిళ్లను ఇచ్చే ఛాన్స్ ఉంది.



