ఆలూరులో టిడిపికి షాక్.. 20 కుటుంబాలు

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుడిమి రాళ్ళ గ్రామానికి చెందిన పలువురు TDP నాయకులు వైసిపిలో చేరారు. కౌలుంట్ల రంగస్వామి ఆధ్వర్యంలో శేఖర్, దస్తగిరి, మల్లికార్జున టిీడీపీ విడిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు సుమారు 20 కుటుంబాలు వైసిపిలో చేరినట్లు రంగస్వామి తెలిపారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి వారికి పార్టీకండువాలు కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.



