← Back to news

వరల్డ్ పోస్ట్ డే..!

By Nani Eluri· 9 Oct 2026
వరల్డ్ పోస్ట్ డే..!

వాట్సాప్, ఈమెయిల్స్ వచ్చినా.. ఒకప్పుడు ఉత్తరం కోసం ఎదురుచూసిన రోజులు చాలామందికి గుర్తుండే ఉంటాయి. ప్రతి ఏడాది అక్టోబర్ 9న వరల్డ్ పోస్ట్ డే జరుపుకుంటారు. 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పడిన రోజుకు గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. 1969లో జపాన్‌లో జరిగిన సమావేశంలో భారత ప్రతినిధి ఆనంద్ మోహన్ నరులా వరల్డ్ పోస్ట్ డే ఆలోచనను ముందుకు తెచ్చారు. అప్పటి నుంచి ఈ రోజును జరుపుకుంటున్నారు. లెటర్లు, పార్శిళ్లతో పాటు బ్యాంకింగ్ సేవల్లోనూ పోస్టల్ నెట్‌వర్క్ కీలకంగా మారింది.

More in Infotainment