కేరళం మాజీ CMకు హైకోర్టులో షాక్.. FIRకు ఆదేశం!

కేరళం మాజీ CM, CPM నేత పినరయి విజయన్‌కు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కూతురు వీణాకు చెందిన IT కంపెనీ ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్’కు అక్రమంగా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై విజయన్, వీణా, ఆమె భర్త, మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ సహా కొందరిపై F.I.R నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. 2017–19 మధ్య సాఫ్ట్‌వేర్, కన్సల్టెన్సీ సేవల పేరుతో దాదాపు 1.72 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసుపై రాష్ట్ర విజిలెన్స్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేయనుంది.


