← Back to news

కదులుతున్న కారుపై కాలు.. బైక్‌ రైడర్‌ స్టంట్స్‌!

By Anusha· 19 Sept 2026· X

లిబియాలో పెళ్లి ఊరేగింపులో ఓ బైక్‌ రైడర్‌ చేసిన సాహసాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక చక్రంతో బైక్‌ను నడుపుతూ అదిరిపోయే స్టంట్స్‌ చేశాడు. బైక్‌కు రాకెట్లు అమర్చి, మంటలు ఎగసిపడుతుండగా హైవేపై దూసుకెళ్లాడు. కదులుతున్న కారుపై కాలు పెట్టి మరీ బైక్‌ను నడిపాడు. పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ ప్రమాదకర విన్యాసాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఇవి ప్రమాదకరమని, ప్రాణాలతో చెలగాటం వద్దని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

More in Viral