కొత్త ‘Weaponized Pooping’ ట్రెండ్

ఇంటర్నెట్‌లో ‘Weaponized Pooping’ ట్రెండ్‌పై చర్చ జరుగుతోంది. పనులు లేదా ఇంట్లో జరిగే గొడవల నుంచి కాసేపు తప్పించుకోవడానికి బాత్రూమ్‌లో ఎక్కువసేపు ఉండటాన్ని ఈ పేరుతో పిలుస్తున్నారు. కొందరు ఫోన్‌లో రీల్స్, సోషల్ మీడియా చూస్తూ 30–40 నిమిషాలు గడుపుతున్నట్లు ఆర్టికల్స్ చెబుతున్నాయి. ఈ పదాన్ని రచయిత ఒలివియా హోవెల్ ఇటీవల ఉపయోగించడంతో సోషల్ మీడియాలో చర్చ పెరిగింది. ఎక్కువసేపు టాయిలెట్‌పై కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్పుతున్నారు.
