పచ్చదనం పెంపుపై AP ఫోకస్..

AP: 2047 నాటికి రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించేందుకు ప్లాన్ అమలు చేస్తున్నట్లు AP గ్రీన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, MLC K. నాగబాబు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల ద్వారా 10 కోట్ల మొక్కలు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తొలి దశలో 500 మండలాల్లో 500 నర్సరీలకు స్థలాలు గుర్తించి, 15 వేల Primary Beds ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొక్కల పెంపకం, నిర్వహణ బాధ్యతలను స్థానిక యువత, మహిళా సంఘాలకు అప్పగించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.



