Latest

దయనీయ స్థితిలో మెదక్ జిల్లా తండాలు
TG: మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ సదాశివనగర్ తండా, పర్వతాపూర్ గ్రామపంచాయతీ బాపనయ్య తండా, కాట్రియాల గ్రామపంచాయతీ పనియా తండా, కిషన్ తండా, కాట్రియాల తండా నుంచి కిషన్ తండాకు వెళ్లే దారి, జెమ్ల తండా గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్ర తండా, బిల్య తండా, సుభాష్ తండా, బిక్షపతి తండాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. రహదారులు లేక ప్రజలు బురదలోనే రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. టూవీలర్స్, ఆటోలు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

యాప్ వచ్చినా..యూరియా కష్టాలు తీరలేదన్నా!
TG: యూరియా కోసం యాప్‌లో బుక్ చేసుకున్నారు. బుకింగ్ సక్సెస్ అంటూ చూపించింది. తీరా యూరియా తీసుకునేందుకు దుకాణానికి వెళ్తే స్టాక్ లేదు అంటూ సమాధానం వస్తోంది. దీంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. యూరియా సరఫరాను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం ఒకవైపు యాప్‌లో బుకింగ్ చేసుకోవడం, మరోవైపు దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెయ్యి పేరుతో పామాయిల్.. హైదరాబాద్‌లో భారీ దందా!
TG: హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, అమ్మకాలపై H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. సిటీలోని 130 సెంటర్లలో తనిఖీ చేయగా, పామాయిల్, వనస్పతి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లతో కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. 36 టన్నుల కల్తీ నెయ్యి, రా మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 10-40 శాతం కల్తీతో తయారైన నెయ్యిని రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులకు సప్లై చేస్తున్నట్లు తేలింది. DCP గైక్వాడ్ వైభవ్, హైదరాబాద్ CP సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

శీర్ష గ్రామంలో పెద్దపులి సంచారం.. హైఅలర్ట్
TG: కొమురంభీమ్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. చెరువు వద్ద, పత్తి చేనుల్లో పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించి పులి పాదముద్రలను గుర్తించారు. పులి ప్రస్తుతం కంకాలమ్మ గుట్ట వైపు వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో కంకాలమ్మ ఆలయం వైపు ప్రజలు, భక్తులు వెళ్లవద్దని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

గుమ్మరేగుల భూములకు పట్టాలు ఇప్పించండి
AP: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామపంచాయతీ పరిధిలోని భూములకు సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాలు ఇప్పించాలని రైతులు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌ను కోరారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు రౌతులపూడి టీడీపీ యువ నాయకుడు పైల వేణు రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. రైతుల సమస్యను సానుకూలంగా విన్న జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

కల్తీ కోవా అక్రమ రవాణా.. 174 కిలోల పదార్థాలు స్వాధీనం
TG: వికారాబాద్ జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. కల్తీ కోవాను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా టీమ్ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 174 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కల్తీ ఆహార పదార్థాలను తయారు చేయడం, రవాణా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చక్కెర ధర కట్టడికి కేంద్రం బిగ్ ప్లాన్!
పండుగల సీజన్ ముందర దేశంలో చక్కెర ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో క్వింటాల్ హోల్‌సేల్ ధర రూ.5,350కి చేరగా, రిటైల్ ప్రైస్ కిలో రూ.52.30 దాటింది. దీంతో కేంద్రం రేట్లను కంట్రోల్ చేయడానికి టాక్స్ (ఇంపోర్ట్ డ్యూటీ) లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల షుగర్ దిగుమతికి పర్మిషన్ ఇవ్వడం, పెద్ద వ్యాపారుల నిల్వలపై లిమిట్స్ విధించడం, మిల్లుల నెలవారీ సేల్స్‌లో మార్పులు చేయడం లాంటి పలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ICU రోగులకు CRRTతో ప్రాణరక్షణ
TG: ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు CRRT (కంటిన్యూస్ రీనల్ రీప్లేస్‌మెంట్ ట్రీట్‌మెంట్) ఆధునిక ప్రాణరక్షక చికిత్సగా నిలుస్తోందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సీఆర్ఆర్‌టీ యంత్రం పనితీరు, వినియోగం, ప్రయోజనాలపై మాట్లాడారు. నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్, క్రిటికల్ కేర్ నిపుణుడు ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం సాధారణమేనని, అలాంటి సమయంలో సీఆర్ఆర్‌టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఉన్నత చదువులకు స్టూడెంట్స్ దూరం!
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.7,000 కోట్లకు చేరడంతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ ప్రమాదంలో పడింది. ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు టిసి, బోనఫైడ్, మెమోలు ఇచ్చేందుకు అస్సలు ఒప్పుకోవట్లేదు. దీంతో మంచి ర్యాంకులు వచ్చినా పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో అప్లై చేసుకోలేక స్టూడెంట్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి రీయింబర్స్‌మెంట్ పెండింగ్ క్లియర్ చేయాలని, తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోరుతున్నారు.

రోగుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది?: AITUC
AP: రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై నంద్యాల జిల్లా సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సున్నిపెంటలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. రాత్రి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. 24 గంటలూ వైద్యులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

పేద విద్యార్థులకు SI చేయూత
AP: పోలీసు విధులతో పాటు పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ కాకినాడ జిల్లా రౌతులపూడి SI వెంకటేశ్వరరావు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రిని స్వయంగా స్పాన్సర్ చేసి చదువుకు చేయూత అందించారు. గతంలో ఎ.మల్లవరం గురుకుల పాఠశాలలో క్రీడా ప్రాంగణం అవసరాన్ని గుర్తించి సుమారు రూ.2 లక్షల విలువైన క్రీడా కోర్టును ఏర్పాటు చేయించారు. విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నారు.

తెలంగాణ BJPపై రాజాసింగ్ అసంతృప్తి.. కారణం ఇదేనా?
TG: గోషామహల్ MLA రాజాసింగ్ తెలంగాణ BJPలో గ్రూపు రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ప్రకటించిన BJP నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తెలంగాణకు చెందిన నేతలకు చోటు దక్కకపోవడంపై ఆయన రెస్పాండయ్యారు. గతంలో తెలంగాణ నేతలు జాతీయ స్థాయిలో కీలక పదవులు పొందారని గుర్తుచేశారు. రాష్ట్రంలో గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని అన్నారు. నేతలు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరముందని సూచించారు.

నల్గొండ ప్రిన్సిపల్ హత్యలో బిగ్ ట్విస్ట్!
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ <a href="https://www.theclearcutnews.com/n/nWdFsLS">రూపారెడ్డి</a> హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ దారుణానికి పాల్పడింది పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అని పోలీసులు గుర్తించారు. క్లూస్ దొరక్కుండా గ్లౌజులు వేసుకుని ప్రిన్సిపల్‌ను కత్తితో పొడిచి చంపినట్లు తేల్చారు. హత్య అనంతరం ఇంట్లోని రూ.4 లక్షల క్యాష్‌తో పరారైన ఈ ముగ్గురు నిందితులను ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి డీటైల్స్ ఈరోజు సాయంత్రంలోగా పోలీసులు అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

పథకాలు అర్హులందరికీ అందాలి : అనిరుద్ రెడ్డి
TG: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు చేరేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

అంతరాయం లేకుండా రైతుబీమా కొనసాగించాలి
TG: రైతు కుటుంబాలకు భరోసాగా నిలిచే రైతు బీమా పథకాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని రైతు రక్షణ సమితి డిమాండ్ చేసింది. హన్మకొండ జిల్లా పరకాలలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్రను రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కిషన్‌రావు, ఇతర నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రైతు బీమా పథకాన్ని కొనసాగించడంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రైతు బీమా క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించి బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
AP: కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా సీఎం చంద్రబాబును కోరారు. అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించడంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

హరీశ్‌రావు హౌస్ అరెస్ట్.. TIMS సందర్శనకు ముందే హైటెన్షన్!
TG: కోకాపేట్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట MLA హరీశ్‌రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సనత్‌నగర్‌లోని TIMS హాస్పిటల్‌ను సందర్శించేందుకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్‌తో BRS వర్గాల్లో ఆందోళన నెలకొంది.
షాకింగ్ రైడ్!
హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ ఏరియాలో తీవ్ర నిర్లక్ష్యంతో కూడిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే స్కూటర్‌పై ఐదుగురు యువకులు ఎంతో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కారు. ఎటువంటి హెల్మెట్ లేకుండా, కనీస ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్డుపై ఇలా డేంజరస్ డ్రైవింగ్ చేయడం చూసి స్థానికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్స్, ఇలాంటి ఓవర్ లోడింగ్ అండ్ రాష్ డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గుతాయి
AP: వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో కొత్త విధానాలను అనుసరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ సూచించారు. మైలవరం మండలం మొరుసుమిల్లిలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. PMDS విధానం ద్వారా నేలలో తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచి పంటల స్థిరత్వాన్ని పెంచుకోవచ్చని రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు.

ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పట్టణ సమీపంలోని ఆదర్శనగర్ కాలనీలో ఏపీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యురాలు డాక్టర్ కే. మేఘమాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 100 మందికి నాడి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు.

గోల్డ్ రేట్స్‌లో బిగ్ చేంజ్!
భారత్‌లో ఈ వారం స్టార్టింగ్ నుంచీ ప్రతి రోజూ గోల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. US ఫెడ్ నిర్ణయాలు, గ్లోబల్ పరిణామాల వల్లే బంగారం వైపు ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం, నేడు ఆగస్టు 19 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,900గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,42,910 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో ప్రైసెస్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కాబట్టి, షాపింగ్ వెళ్లేముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.