← Back to news

పథకాలు అర్హులందరికీ అందాలి : అనిరుద్ రెడ్డి

By Surendar Panuganti· 19 Aug 2026· Jadcherla, Jadcherla, Mahabubnagar
పథకాలు అర్హులందరికీ అందాలి : అనిరుద్ రెడ్డి

TG: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు చేరేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

పథకాలు అర్హులందరికీ అందాలి : అనిరుద్ రెడ్డి

More in Local