Latest

విఐపీ భద్రతలో అప్రమత్తతే కీలకం
Local· 18 Aug 2026

విఐపీ భద్రతలో అప్రమత్తతే కీలకం

TG: విఐపీ భద్రతా విధుల్లో ఉన్న పీఎస్‌ఓలు అప్రమత్తత, క్రమశిక్షణ, సమన్వయంతో పని చేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. కమిషనరేట్‌లో పీఎస్‌ఓలకు విఐపీ భద్రతపై సంక్షిప్త శిక్షణ నిర్వహించారు. ఆరోగ్యం, శారీరక దారుఢ్యంతో పాటు మంచి అలవాట్లు, నిజాయితీ, విశ్వసనీయత పాటించాలని సూచించారు. భద్రతకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, అనుమానాస్పద కదలికలను వెంటనే ఉన్నతాధికారులకు చెప్పాలని ఆదేశించారు.

ఉదయాన్నే నిద్రలేవాలా? ఈ ట్రిక్ వాడండి!
Motivational· 18 Aug 2026

ఉదయాన్నే నిద్రలేవాలా? ఈ ట్రిక్ వాడండి!

ఉదయాన్నే త్వరగా లేవడం వల్ల జీవితంలో క్రమశిక్షణ, గెలుపు సాధ్యమవుతాయి. అయితే బద్ధకాన్ని వదిలి మంచం దిగడం చాలామందికి కష్టంగా ఉంటుంది. దీనికోసం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మెల్ రాబిన్స్ ‘5 సెకన్ల రూల్’ అనే ఒక మంచి ట్రిక్ చెప్పారు. ఉదయం మెలకువ రాగానే రాకెట్ లాంచ్ లాగా మనసులో 5, 4, 3, 2, 1 అని కౌంట్‌డౌన్ చేసుకుని వెంటనే మంచం దిగేయాలి. ఈ చిట్కా బద్ధకాన్ని పోగొట్టడమే కాకుండా, ఆందోళనను, సాకులు చెప్పే అలవాటును వదిలించడానికి అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు.

కంగారు, చిరాకుగా ఉంటోందా?.. కారణం ఇదే కావచ్చు!
Health· 18 Aug 2026

కంగారు, చిరాకుగా ఉంటోందా?.. కారణం ఇదే కావచ్చు!

ఆందోళన, చిరాకు, అలసట వస్తుంటే దానికి కేవలం టెన్షనే కారణం కాకపోవచ్చు, శరీరంలో విటమిన్ బి12 తగ్గడం వల్ల కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ విటమిన్ తగ్గితే మెదడు, నరాల బలం తగ్గి భయం, మూడ్ మారడం వంటి సమస్యలొస్తాయి. మన శరీరం బి12ని సొంతంగా తయారు చేసుకోలేదు. కాబట్టి మనం తినే గుడ్లు, పాలు, పాల పదార్థాలు, చేపలు, చికెన్, మాంసం ద్వారానే దీనిని పొందాల్సి ఉంటుందని తెలిపారు.

పిల్లల కోసం ChatGPT మారుతోంది!
Technology· 18 Aug 2026

పిల్లల కోసం ChatGPT మారుతోంది!

ఇక 13–17 ఏళ్ల వాళ్లు ChatGPT వాడితే.. పెద్దలు వాడే విధంగా అంతా ఒకేలా ఉండదు. OpenAI టీనేజర్ల కోసం ప్రత్యేకంగా ChatGPT for Teensను తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ వయసులో AIని వాడేటప్పుడు కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. అందుకే సున్నితమైన కంటెంట్‌పై అదనపు పరిమితులు, వయసుకు తగ్గ సమాధానాలు ఉంటాయి. అంతేకాదు, తల్లిదండ్రులు కొన్ని సెట్టింగ్స్‌ను తమకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. అంటే.. ChatGPT ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు అనేదాన్ని కూడా పట్టించుకునే దిశగా అడుగు వేసిందన్నమాట.

NTR - త్రివిక్రమ్ కాంబో.. రెండు టైటిల్స్!
Entertainment· 18 Aug 2026

NTR - త్రివిక్రమ్ కాంబో.. రెండు టైటిల్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనే వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రెండు టైటిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ‘దేవసేనాపతి’, ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేర్లను రిజిస్టర్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.

కర్నూలులో డ్రోన్ హబ్.. భారీగా ఉద్యోగాలు
AP· 18 Aug 2026

కర్నూలులో డ్రోన్ హబ్.. భారీగా ఉద్యోగాలు

AP: ఈరోజు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీని దేశంలోనే డ్రోన్ తయారీ, పరిశోధన, శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ.5 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశముందన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే 5 వేల మందికి డైరెక్ట్‌గా, 25 వేల మందికి ఇన్‌డైరెక్ట్‌గా ఉపాధి లభిస్తుందని చెప్పారు. రానున్న 2–3 ఏళ్లలో అన్ని ప్లాట్ల కేటాయింపులు పూర్తి చేసి తయారీ ప్రారంభిస్తామని వెల్లడించారు.

తెలంగాణలో MBBS, BDS ప్రవేశాలకు మళ్లీ రిజిస్ట్రేషన్
Education· 18 Aug 2026

తెలంగాణలో MBBS, BDS ప్రవేశాలకు మళ్లీ రిజిస్ట్రేషన్

TG: MBBS, BDS అడ్మిషన్ల కోసం చూస్తున్న స్టూడెంట్స్‌కు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి స్టార్ట్ చేసినట్టు పేర్కొంది. స్టూడెంట్స్ రిక్వెస్ట్‌లను పరిగణంలోకి తీసుకుని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం కల్పించినట్లు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు అడ్మిషన్ <a href="https://tsmedadm.tsche.in/">పోర్టల్‌</a> చూడొచ్చు.

పసిబిడ్డతో అసెంబ్లీకి ఎమ్మెల్యే.. విమర్శలకు గట్టి కౌంటర్!
National· 18 Aug 2026

పసిబిడ్డతో అసెంబ్లీకి ఎమ్మెల్యే.. విమర్శలకు గట్టి కౌంటర్!

తమిళనాడు అసెంబ్లీకి తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఎమ్మెల్యే ఆర్. పల్లవి తన పసిబిడ్డతో రావడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. పాపను కేర్‌టేకర్ దగ్గర బయట ఉంచి ఆమె సభకు హాజరవుతున్నారు. దీనిపై కొందరు మెచ్చుకోగా, మరికొందరు 'కేవలం పబ్లిసిటీ కోసమే ఈ సీన్లు చేస్తున్నారు' అని కామెంట్లు చేశారు. ఈ విమర్శలపై ఎమ్మెల్యే స్పందిస్తూ 'పాప చిన్నది, ఇంట్లో ఒంటరిగా వదిలేసి రాలేను. తల్లిగా నా బాధ్యత చూసుకుంటూనే, ఎమ్మెల్యేగా పని చేయడంలో తప్పేంటి?' అని అడిగారు. ఎవరి పరిస్థితి తెలుసుకోకుండా ట్రోల్ చేయడం సరికాదన్నారు.

బిహార్‌లో భారీగా టీచర్ పోస్టుల భర్తీ!
Jobs· 18 Aug 2026

బిహార్‌లో భారీగా టీచర్ పోస్టుల భర్తీ!

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు బిహార్ ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ద్వారా ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRE 4.0) కింద ఏకంగా 32,388 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1 నుంచి 12వ తరగతి వరకు పాఠాలు చెప్పే ప్రైమరీ, సెకండరీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు <a href="https://indianexpress.com/article/education/bihar-bpsc-tre-4-teacher-recruitment-advertisement-out-vacancies-posts-important-dates-bpsc-bihar-gov-in-10838712/">చెప్పారు</a>.

మున్సిపల్ కార్మికుల నిరసన
Local· 18 Aug 2026

మున్సిపల్ కార్మికుల నిరసన

AP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు.. మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, మున్సిపల్, పౌర సేవల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు .

హార్దిక్ పాండ్యా నుంచి క్రాంతి గౌడ్‌కు స్పెషల్ గిఫ్ట్!
Sports· 18 Aug 2026

హార్దిక్ పాండ్యా నుంచి క్రాంతి గౌడ్‌కు స్పెషల్ గిఫ్ట్!

భారత మహిళల క్రికెటర్ క్రాంతి గౌడ్ తన అభిమాన ఆటగాడైన హార్దిక్ పాండ్యా నుంచి గొప్ప కానుక అందుకుంది. బెంగళూరులో వీరిద్దరూ కలిసినప్పుడు, క్రాంతి పుట్టినరోజు సందర్భంగా పాండ్యా తన సంతకంతో కూడిన 33వ నంబర్ జెర్సీని ఇచ్చాడు. తాను ఎంతగానో అభిమానించే పాండ్యా నుంచి జెర్సీ అందడంతో క్రాంతి గౌడ్ చాలా ఆనందించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.

నటి నమిత వెయిట్ లాస్ సీక్రెట్!
Health· 18 Aug 2026

నటి నమిత వెయిట్ లాస్ సీక్రెట్!

సినీ నటి <a href="https://www.instagram.com/reel/Dbx2IqMJr8k/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ==">నమిత</a> 3 నెలల్లో 10 కేజీల బరువు తగ్గి షాక్ ఇచ్చారు. క్రాష్ డైటింగ్, పస్తులు లేకుండా కేవలం సౌత్ ఇండియన్ డైట్, ఇంటెన్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తోనే ఇది సాధ్యమైందని చెప్పారు. కఠినమైన డైట్ వల్ల మజిల్స్ వీక్ అవుతాయని, హెల్దీగా బరువు తగ్గాలంటే ప్రాపర్ ఫుడ్, వర్కవుట్స్ రెండూ ముఖ్యమని వివరించారు. 'స్కల్ప్ట్ యువర్ బాడీ' డైటీషియన్ ధరణి గైడెన్స్‌తో బరువు తగ్గడం చాలా హ్యాపీగా ఉందంటూ ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

300 మంది విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ
Local· 18 Aug 2026

300 మంది విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ

TG: సిరిసిల్ల ప్రభుత్వ బాలికల కళాశాలలో 300 మంది విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. వనజా కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి 4వ వార్డ్ కౌన్సిలర్ లైఖ్ సుల్తానా తాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తొలిసారిగా ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ఒక్కొక్కరికి 12 ఉచిత నోట్‌బుక్స్ అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు కష్టపడి చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

నర్సంపేటలో పెద్ది విగ్రహం తొలగింపు
Local· 18 Aug 2026

నర్సంపేటలో పెద్ది విగ్రహం తొలగింపు

TG: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. గద్దెను పూర్తిగా కూల్చివేశారు. సిమెంట్ ఇటుకలను అక్కడ నుండి దూరంగా తరలించారు. దగ్గరలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సైతం ఫోన్లు వాడేందుకు అధికారులు నిరాకరించినట్లు సమాచారం. విగ్రహం తొలగింపు ప్రక్రియ అత్యంత రహస్యంగా పోలీసుల పహారాలో చేపట్టారు. సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్తున్న వారిని మధ్యలోనే అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.

CJP ఎంట్రీతో ప్రిన్సిపాల్ సస్పెండ్!
Current Affairs· 18 Aug 2026

CJP ఎంట్రీతో ప్రిన్సిపాల్ సస్పెండ్!

మహారాష్ట్రలోని హింగోలి జిల్లా లింబాలా మక్తా గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. స్కూల్‌లోనే మద్యం తాగి క్లాస్‌రూమ్‌లో నిద్రపోతున్నాడని విలేజర్స్, సీజేపీ ఫౌండర్ <a href="https://x.com/abhijeet_dipke/status/2089603362107048005?s=20">అభిజీత్ దిప్కే</a> బిడిఓకి కంప్లైంట్ చేశారు. దిప్కే ఆగస్టు 15న స్కూల్‌ను విజిట్ చేసి, యాక్షన్ తీసుకోకపోతే ప్రొటెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ సస్పెండ్ అయినప్పటికీ, ఐదు క్లాసులకు ఇద్దరే టీచర్స్ ఉన్నారని, మరో ఇద్దరు టీచర్లను ఇచ్చే వరకు తమ ఫైట్ కంటిన్యూ అవుతుందని దిప్కే స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో మత మార్పిడుల నిరోధక చట్టం!
National· 18 Aug 2026

మహారాష్ట్రలో మత మార్పిడుల నిరోధక చట్టం!

మహారాష్ట్ర ప్రభుత్వం ‘<a href="https://economictimes.indiatimes.com/news/india/maharashtra-freedom-of-religion-act-to-come-into-force-on-august-28-what-changes/articleshow/133320393.cms">ద మహారాష్ట్ర ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్, 2026</a>’ పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చింది. మోసం చేసి లేదా బలవంతంగా మతం మార్చితే గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇది బెయిల్ రాని నేరం. ఎవరైనా ఇష్టంతో మతం మారాలన్నా 60 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. చట్టవ్యతిరేకంగా మతం మారినవారి పిల్లలకు తల్లి మతమే వర్తిస్తుంది. బలవంతపు మార్పిడులను అడ్డుకోవడానికే ఈ చట్టమని ప్రభుత్వం చెప్పగా, కొందరు మాత్రం ఇది వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీస్తుందని విమర్శిస్తున్నారు.

సోషల్‌ మీడియా సంస్థలు భారత చట్టాలను పాటించాల్సిందే: కేంద్రం
Current Affairs· 18 Aug 2026

సోషల్‌ మీడియా సంస్థలు భారత చట్టాలను పాటించాల్సిందే: కేంద్రం

దేశంలో పనిచేసే ఏ సోషల్‌ మీడియా సంస్థ అయినా దేశంలో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘ఎక్స్‌’కు కేంద్రం స్పష్టమైన సందేశం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఏ అకౌంట్‌ను అయినా తొలగించాలని ఆదేశిస్తే.. ఆ ఆదేశం యూజర్స్‌కు కనిపించేలా, అందరికీ తెలిసేలా ‘ఎక్స్‌’ ఇటీవల కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై కేంద్రం స్పందించింది.

తమిళ జాతీయవాద పునరుజ్జీవన మహాసభకు భారీ స్పందన
Current Affairs· 18 Aug 2026

తమిళ జాతీయవాద పునరుజ్జీవన మహాసభకు భారీ స్పందన

తమిళనాడులోని ఉలంగూరులో జరిగిన తమిళ జాతీయవాద పునరుజ్జీవన మహాసభకు భారీ స్పందన వచ్చింది. విడుదలై సిరుతైగళ్ కట్చి(VCK) అధ్యక్షుడు తలైవర్ తిరుమావళవన్ పుట్టిన రోజున నిర్వహించిన ఈ సభలో పది లక్షల మంది పాల్గొన్నారు. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అనే ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాన్ని దక్షిణ భారత ప్రజలు అంగీకరించరని సభ తీర్మానం చేసింది. రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్న తీరును వీసీకే తీవ్రంగా వ్యతిరేకించింది. మహాసభ తీర్మానాలకు జనం చప్పట్లతో ఆమోదం తెలిపారు.

ఆఫర్ లెటర్ ఉంది… ఉద్యోగం మాత్రం లేదు! 😳
National· 18 Aug 2026

ఆఫర్ లెటర్ ఉంది… ఉద్యోగం మాత్రం లేదు! 😳

ఊహించండి… నెలలుగా ఉద్యోగం కోసం ఎదురుచూశారు. ఆఫర్ వచ్చింది. జాయినింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఇక కొత్త జీవితానికి రెడీ అవుతున్న సమయంలో, జాయినింగ్‌కు ఐదు రోజుల ముందు ఆఫర్ రద్దయితే ఎలా ఉంటుంది? భారతీయ గ్రాడ్యుయేట్ తేజస్వ్ అగర్వాల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆగస్టు 18న ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేరాల్సి ఉండగా, ఆఫర్‌ను రద్దు చేసినట్లు ఆయన <a href="https://www.linkedin.com/posts/tejasw464_tejaswagrawalresume-ugcPost-7495079436397162498-Ktnw/?utm_source=share&amp;utm_medium=member_desktop&amp;rcm=ACoAAExY3CYBKjyriNTuPUsNR_7VtmGSH_AgEg8">LinkedIn</a>లో వెల్లడించారు. మేలో ఇదే ఆఫర్‌ను ఒకసారి రద్దు చేసి, జూలైలో తిరిగి ఇచ్చారట. ఉద్యోగం దొరికిందని సంబరపడేలోపే… అది ఉంటుందా అనే ప్రశ్న మొదలవుతోంది.

రేపు సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్ర
AP· 18 Aug 2026

రేపు సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్ర

AP: 10వ తరగతి స్టూడెంట్ సుగాలి ప్రీతి హత్యాచార ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2017లో కర్నూలులో జరిగిన ఈ అన్యాయంపై బాధితురాలి తల్లి పార్వతి నేటికీ పోరాటం చేస్తున్నారు. ఆగస్టు 19వ తేదీ ప్రీతి మరణించిన రోజు. ఈ సందర్భంగా ప్రీతి తల్లి పార్వాతి కర్నూలు నుంచి విజయవాడ వరకు వీల్‌చైర్ యాత్ర చేస్తున్నారు. నిందితులకు శిక్ష పడాలని, ఈ కేసుకు సంబంధించి పూర్తి నిజాలు వెలికితీసి న్యాయం చేయాలని కోరుతున్నారు.

AE ఫ్యామిలీ సూసైడ్?
AP· 18 Aug 2026

AE ఫ్యామిలీ సూసైడ్?

పిఠాపురం AE నూకరాజు ఫ్యామిలీ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో షేక్ సాదిక్ ఖాన్‌పై పోలీసులు ఇంకో మర్డర్ కేసు కూడా ఫైల్ చేశారు. జులై 2న నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ చంపేశాడని, ఆ తర్వాత ఫ్యామిలీని బెదిరించి ప్రాపర్టీ, బ్యాంక్ లాకర్ డీటైల్స్ లాక్కున్నాడని సూసైడ్ నోట్‌లో రాశారు. సాదిక్ వేధింపులు తట్టుకోలేకే సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో 10 ఏళ్ల మనవడు ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు.