Latest

వార్ సైరన్.. ఉక్రెయిన్లో జగిత్యాల వాసి మృతి!
జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ (42) ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందారు. కుటుంబ పోషణ కోసం కంపెనీ వీసాపై 4 నెలల క్రితం ఆయన అక్కడికి వెళ్లి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి రష్యా డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. వార్ సైరన్ మోగడంతో ఆయన రూమ్ నుంచి బయటకు పరిగెత్తారు. దురదృష్టవశాత్తూ.. ఆయన వెళ్తున్న దిశలోనే క్షిపణి పడిపోయింది! ఆ దాడిలో 12 మంది మృతి చెందారు. ఆ దాడిలో మరో జగిత్యాల వాసి మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఖమ్మంలో వాన దంచికొడుతోంది.. రాత్రికి అలర్ట్!
ఖమ్మం నగరంలో మధ్యాహ్నం 2:40 నుంచి వర్షం దంచి కొడుతోంది. ఉదయం చిరుజల్లులు పడ్డాయి.. తర్వాత ఎండతో ఉబ్బ తీసింది. ఇప్పుడు మాత్రం వాన సెలవు ప్రకటించింది.. అంటే కాస్త ఆగింది! కానీ వాతావరణ శాఖ మాత్రం రాత్రి 8 గంటల తర్వాత మళ్ళీ వర్షం పెరగొచ్చని చెప్తోంది. ఖమ్మం వాసులు అప్రమత్తంగా ఉండాలి. రాత్రివేళ బయటకు రాకండి.. సురక్షితంగా ఉండండి!

CM రేవంత్‌పై మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్!
TG: మీడియాతో మంత్రి కొండా సురేఖ CM రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై యాక్షన్ తీసుకునే ముందు CMపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. రేవంత్ 10 ఏళ్ల పాటు తానే CM అని చెప్పుకుంటున్నారని అన్నారు. CMపై మంత్రులు, నేతల్లోనూ అసంతృప్తి ఉందని చెప్పారు. BCలకు ఓ రూల్, ఇతర సామాజిక వర్గాలకు మరో రూలా? అని ప్రశ్నించారు. ఖర్గేను కలిశానని, వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదు అన్నారు. పార్టీ హైకమాండ్‌కు అన్ని విషయాలను రాతపూర్వకంగా వివరించానని అన్నారు. వారితో నన్ను పదవిలో కొనసాగించమని కోరినట్లు మీడియాకు తెలిపారు.

420 హామీలు.. కోరుట్లలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ!
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాస్త 420 హామీలుగా మారిపోయాయంటూ 420 అడుగుల ఫ్లెక్సీతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలననే గొప్పదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత పాల్గొన్నారు. "రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి" అంటూ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశాయి.

మహిళలకి హైకోర్టు గుడ్ న్యూస్!
ప్రెగ్నెన్సీ తర్వాత ఆఫీస్‌కి వచ్చే మహిళలకు ఢిల్లీ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. మెటర్నిటీ లీవ్ తర్వాత వచ్చే ఉమెన్ ఎంప్లాయ్స్‌కి మునుపటి పొజిషన్, సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలని, కెరీర్ గ్రోత్‌కి ప్రాబ్లం రానివ్వకూడదని స్పష్టం చేసింది. వర్క్‌ప్లేస్ సపోర్ట్, ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కోసం 6 నెలల్లోగా స్పెషల్ రూల్స్ తేవాలని సెంట్రల్ గవర్నమెంట్‌ని ఆదేశించింది. ప్రైవేట్ కంపెనీల్లోనూ ఈ రూల్స్ పక్కాగా వర్తిస్తాయని జస్టిస్ సచిన్ దత్తా చెప్పారు.

డిజాస్టర్ అవగాహన.. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు శిక్షణ!
బాపట్ల జిల్లా వేమూరు మండలం తెల్లవారి గ్రామంలో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అవగాహన సెషన్ నిర్వహించారు. పెరవల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, కార్డ్ సిబ్బంది ఎం.శ్రీనివాసరావు, పి.సురేఖ, ఆర్.అనిత విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. విపత్తులు వచ్చినప్పుడు ఎలా రక్షించుకోవాలో పీపీటీ ద్వారా నేర్పించారు. కార్డ్ సంస్థ ఇప్పటికే 5 మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ప్రమాదం
TG: కరీంనగర్ జిల్లాలో బస్సుకు ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. బస్సు బావిలోకి పడకుండా ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొని బయటపడ్డారు.

స్కాలర్‌షిప్ అప్లికేషన్ గడువు పొడిగింపు
కేంద్ర విద్యాశాఖ నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(NMMSS) 2026-27 అకడమిక్ సంవత్సరానికి అప్లికేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ <a href="https://scholarships.gov.in/">పోర్టల్</a> ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 9వ క్లాసులో కొత్తగా లక్ష మంది మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. 10, 11, 12వ క్లాసుల్లో ప్రోగ్రెస్ ఆధారంగా రెన్యూవల్ చేస్తారు. ఒక్కో స్టూడెంట్‌కి ఏడాదికి రూ.12,000 స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

నీట్ ప్రొటెస్టర్స్ సక్సెస్: కేసులన్నీ క్లోస్!
నీట్ 2026 ప్రొటెస్టర్లపై ఉన్న అన్ని FIRలను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టేసింది. జంతర్ మంతర్ నిరసనల టైమ్‌లో దేశవ్యాప్తంగా నమోదైన పాత కేసులను రద్దు చేయడంతో పాటు, ఫ్యూచర్‌లో కొత్తగా ఎలాంటి కేసులు పెట్టకూడదని ఆర్డర్ వేసింది. అలాగే, నీట్ బాధితుల ఫ్యామిలీస్‌కి 90 రోజుల్లోగా కాంపెన్సేషన్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. లీగల్ పోరాటంలో తమ డిమాండ్స్ అన్నీ నెరవేరడంతో బాధితులకు కంప్లీట్ జస్టిస్ దక్కిందని CJP లాయర్ రత్నసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు.

పాకాలలో అరుదైన వైట్-ఐడ్ బజార్డ్ సందడి!
పాకాలకు కొత్త చుట్టం వచ్చింది. దక్షిణాసియాలో అక్కడక్కడ కనిపించే అరుదైన పక్షి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల పార్కులో కనిపించింది. అదే వైట్-ఐడ్ బజార్డ్. బుధవారం ఈ జువైనైల్ పక్షిని సందర్శకులు గుర్తించారు. ఎకో టూరిజం వాచర్ జయప్రకాష్ ఫోన్‌లో ఫొటో తీశారు. గోధుమ కళ్లు, తెల్లని నుదురు - ఇవి ఈ చిన్న బర్డ్ స్పెషల్ ఐడెంటిటీ! ఇది మిడతలు, బల్లులు, కప్పలు తింటుంది. పాకాల ఎకో టూరిజం ఇప్పుడు బర్డ్ వాచర్స్ హాట్‌స్పాట్ గా అభివృద్ధి అవుతోంది. పర్యావరణాన్ని కాపాడితే ఇలాంటి సర్‌ప్రైజెస్ ఎన్నో చూడొచ్చు.

ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. APలో 917, తెలంగాణలో 419 ఖాళీలు
ఇండియా పోస్ట్‌లో (GDS, BPM, ABPM) 25,000+ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10th క్లాస్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఏజ్ 18–40 ఏళ్లు మధ్య ఉండాలి. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19 లోపు చేసుకోవాలి. అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ కాగా, ఈనెల 21తో ముగుస్తాయి. మేల్ జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. SC/ST/PwD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. సెలెక్షన్ 10th క్లాస్ (SSC) మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ కోసం ఇక్కడ <a href="https://www.indiapost.gov.in/gdsonlineengagement">Click </a>చేయండి.
రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. మీరే ఇవ్వాలి CM సారూ!
TG: సిద్ధిపేటలోని శ్రీకృప ఫార్మా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్స్ ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధను వీడియో ద్వారా తెలిపారు. ఫీజులు చెల్లించకపోవడంతో 30 మందిక సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. తమకు సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. ఈ పోస్ట్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు.

18 ఎకరాల సర్కారు భూమి... HC చెప్పినా సర్వే చేయరా?
అధికారులు హై కోర్టు చెప్పినా వినట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో విద్యానగర్ పంచాయతీ పరిధిలోని 18 ఎకరాల సర్కారు భూమి కబ్జాకు గురైంది. హైకోర్టు 3 కేసుల్లో (WP 1169, 6059, 5706) ఆ భూమి సర్కారుదేనని స్పష్టం చేసింది. రెవెన్యూ అధికారులు మాత్రం ఒక్క కేసునే సర్వే చేసి ఆగిపోయారు. మిగిలిన భూమిని సర్వే చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ’’ఇంతకీ మిగిలిన 17 ఎకరాల విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? కబ్జాదారులతో ఏమైనా కుమ్మక్కు అయ్యారా‘‘అని వారు ప్రశ్నిస్తున్నారు.

రూ.2 లక్షల బీమా చెక్కు అందజేసిన TGB మేనేజర్
జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ లోని ఉట్కూర్‌లో ఇటీవల మరణించిన లక్ష్మీదేవి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగరాజ్, ఆ చెక్కును నామినీ నర్సింహకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.టి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు రామాంజనేయులు, శిరీష పాల్గొన్నారు. ఇది పీఎంజెజెబివై పథకం కింద మంజూరైన బీమా. తక్కువ ప్రీమియంతో ఈ పథకాల్లో చేరితే ఇలాంటి హెల్ప్ వస్తుందని మేనేజర్ చెప్పారు.

వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
TG: ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ఎస్‌ఐఆర్–2026లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేసులపై జరుగుతున్న విచారణలను కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన ఓటర్ల వివరాలు, బీఎల్‌ఓల పరిశీలన, సంబంధిత ఆధారాలు, రికార్డులను తనిఖీ చేశారు. అర్హత కలిగిన కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును పారదర్శకంగా విచారించాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే
TG: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శాలెం ఎం.బి. చర్చిని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పాస్టర్‌తో మాట్లాడి చర్చి, క్రిస్టియన్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రైస్తవుల సంక్షేమం, చర్చిల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైన అభివృద్ధి పనులకు తన ఎమ్మెల్యే నిధుల నుంచి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. చర్చి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

లెజెండరీ కర్నాటిక్ సింగర్ రోల్‌లో రష్మిక!
లెజెండరీ కర్నాటిక్ సింగర్, భారతరత్న M.S. సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం రష్మిక మందన్నతో చర్చలు జరుగుతున్నాయి. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రీ-ప్రొడక్షన్, రీసెర్చ్ వర్క్ వేగంగా సాగుతోంది. మొదట సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు వినిపించినా, ప్రస్తుతం రష్మికనే ఈ సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్‌కి ఫ్రంట్‌రన్నర్‌గా నిలిచింది. డిస్కషన్స్ పాజిటివ్‌గా ఉన్నాయని, త్వరలోనే ఫుల్ కాస్ట్, క్రూ, షూటింగ్ షెడ్యూల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టీమ్ సోర్సెస్ కన్ఫర్మ్ చేశాయి.
420 అడుగుల భారీ ఫ్లెక్సీతో బీఆర్‌ఎస్ నిరసన
TG: హనుమకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ కూడలి వరకు 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

‘Toxic’ సినిమాకు మహేష్‌బాబు కొడుకు ఇచ్చిన రేటింగ్?
హీరో Mahesh Babu కొడుకు Gautam Ghattamaneni Letterboxd అకౌంట్ ప్రస్తుతం వైరల్ అయింది. ఇందులో అతను 400కి పైగా సినిమాలు లాగ్ చేశాడు. ఇటీవల యష్ నటించిన ‘Toxic’ సినిమాకు 0.5/5 స్టార్స్ ఇచ్చాడు. అలాగే తన తండ్రి సినిమాల్లో ‘పోకిరి’, ‘నేనొక్కడినే’ సినిమాలకు 5 స్టార్స్, ‘బ్రహ్మోత్సవం’ 1 స్టార్, ‘నిజం’, ‘వంశీ’ సినిమాలకు 2 స్టార్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ అకౌంట్ డిసేబుల్ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

అవ్వకు CM విజయ్ స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్!
తమిళనాడు CM విజయ్ సేలంలో ఓ వృద్ధురాలిని కలసి సర్‌ప్రైజ్ చేశారు. మేట్టూరు డ్యామ్ విజిట్ తర్వాత ఓ రైతు ఇంటి దగ్గర ఆగిన విజయ్.. చెల్లం అనే వృద్ధురాలితో కాసేపు మాట్లాడారు. ఆమె ఆరోగ్యం, భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత తాను పెట్టుకున్న Dior సన్‌గ్లాసెస్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మొదట ఆమె ఫస్ట్‌లో తీసుకోడానికి మొహమాటపడినా విజయ్ స్వయంగా ఆమెకు పెట్టారు. ఈ క్యూట్ మూమెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెరిగిన ధరలు తగ్గించాలి.. సత్తుపల్లిలో ఆందోళన
TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బుధవారం నిర్వహించిన ఈ నిరసనలో నాయకులు గంటా శ్రీనివాసరావు, అమర్లపూడి శరత్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి పేద, సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతోందని ఆరోపించారు. బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.