← Back to news

420 హామీలు.. కోరుట్లలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ!

By Shiva· 2d ago
420 హామీలు.. కోరుట్లలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ!

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాస్త 420 హామీలుగా మారిపోయాయంటూ 420 అడుగుల ఫ్లెక్సీతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలననే గొప్పదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత పాల్గొన్నారు. "రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి" అంటూ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశాయి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 7h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.