Latest

OTP లు షేర్ చేయొద్దు.. ఖమ్మంలో అవగాహన!
Local· 2d ago

OTP లు షేర్ చేయొద్దు.. ఖమ్మంలో అవగాహన!

ఖమ్మం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సైబర్ నేరాల అవగాహన సదస్సు జరిగింది. ఎస్ఐ పల్లెల ప్రదీప్ మాట్లాడుతూ.. అపరిచితుల ఫోన్ కాల్స్ నమ్మొద్దని హెచ్చరించారు. ’’బ్యాంక్ సిబ్బంది అని చెప్పి OTP లు అడిగితే జాగ్రత్త! ఆ వివరాలు ఎవరికీ చెప్పొద్దు. మీ వ్యక్తిగత వివరాలు కూడా పంచుకోవద్దు. మోసపోతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీను, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

డిజిటల్ అరెస్ట్.. ఎస్పీ రోహిత్ హెచ్చరిక!
Local· 2d ago

డిజిటల్ అరెస్ట్.. ఎస్పీ రోహిత్ హెచ్చరిక!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు జరిగింది. అబ్దుల్ కలాం కళాశాలలో SP రోహిత్ రాజు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డిజిటల్ అరెస్ట్, నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. OTPలు, ఫోటోలు, వ్యక్తిగత వివరాలు అపరిచితులకు పంచుకోవద్దని స్పష్టం చేశారు. మోసం జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని, సినిమాల చెడు ప్రభావాలను అనుకరించవద్దని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీ హక్కుల కోసం.. సెప్టెంబర్ 6న ఛలో ఢిల్లీ!
Local· 2d ago

ఆదివాసీ హక్కుల కోసం.. సెప్టెంబర్ 6న ఛలో ఢిల్లీ!

ఆంధ్రప్రదేశ్ ఆదివాసీలు హక్కుల కోసం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. 1/70 భూ బదలాయింపు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 2000లో వచ్చిన జీఓ-3కి బదులుగా కొత్త జీఓ జారీ చేయాలని కోరుతున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల అక్రమ ఒప్పందాల జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ’’అడవి, భూమి, నీటిపై ఆదివాసీలకే సర్వహక్కులు ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. సర్కారు ఉల్లంఘిస్తోంది. అందుకే సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింద’’ని నాయకులు చెప్పారు.

IPPB 9వ యానివర్సిరీ..మూడు కొత్త సర్వీసెస్ ప్రారంభం
National· 2d ago

IPPB 9వ యానివర్సిరీ..మూడు కొత్త సర్వీసెస్ ప్రారంభం

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తన 9వ ఫౌండేషన్ డే సందర్భంగా వ్యాపారులు, బీమా, పెట్టుబడుల రంగాల్లో మూడు కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించింది. అవి DakPay Sound Box, Digital Insurance Technology Platform, Digital Mutual Fund Platform. ప్రస్తుతం బ్యాంకుకు దేశవ్యాప్తంగా 13.25 కోట్ల మంది Account Holders ఉన్నారు. వీళ్లల్లో 77 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. 49 శాతం మంది మహిళలు. బ్యాంకు ఇప్పటివరకు ₹21.61 లక్షల కోట్ల విలువైన డిజిటల్ ట్రాన్‌సాక్షన్స్ నిర్వహించింది.

టెట్ మినహాయింపు కోరి.. గుంటూరులో టీచర్ల ధర్నా!
Local· 2d ago

టెట్ మినహాయింపు కోరి.. గుంటూరులో టీచర్ల ధర్నా!

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని విద్యాభవన్ ఎదుట ఇన్‌సర్వీస్ టీచర్లు నిరసనకు దిగారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాస్ మార్కులను 40 శాతానికి తగ్గించాలని, ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని కోరారు. అంతేకాదు.. మ్యాథ్స్, సైన్స్ టీచర్లకు సంబంధిత సబ్జెక్టుల్లోనే టెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ స్పందించకపోతే విజయవాడలో భారీ ధర్నా చేస్తామని ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు.

వైఎస్ వర్ధంతి.. గోకవరంలో ఘన నివాళులు!
Local· 2d ago

వైఎస్ వర్ధంతి.. గోకవరంలో ఘన నివాళులు!

తూ.గో. జిల్లా గోకవరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరిగింది. సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో విగ్రహానికి జలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భవిత సెంటర్‌లో దివ్యాంగ విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. వీరబాబు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం వైఎస్ అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదలకు మేలు చేసిందని అన్నారు. వైఎస్సార్ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.20 లక్షలు.. డ్రైనేజీ పనులు మాత్రం జీరో!
Local· 2d ago

రూ.20 లక్షలు.. డ్రైనేజీ పనులు మాత్రం జీరో!

జగిత్యాల పట్టణంలోని 45వ వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం ఇంకా మొదలు కాలేదు! కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారుల కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఓ ఇంటి యజమాని తన ఇంటి ముందు సొంత డబ్బులతో డ్రైనేజీ పనులు చేయించుకుంటున్నారు. ’’డబ్బు మంజూరైనా పనులు ఎందుకు చేస్తలేరు. ఎందుకింత నిర్లక్ష్యం? నేను టాక్సు కట్టను. అప్పుడు నన్ను ఏమీ అనరు కదా’’ అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? వీడియో తీయండి. పంపండి.

నా కూతురు స్వతంత్రంగా మాట్లాడింది: కొండా సురేఖ
TG· 2d ago

నా కూతురు స్వతంత్రంగా మాట్లాడింది: కొండా సురేఖ

TG: ‘నా కూతురికి పెళ్లైంది. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు’ అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ తన భర్త మున్నూరు కాపు, తను పద్మశాలి కులానికి చెందిన వ్యక్తులమని తెలిపారు. తమకు 16 శాతం ఓట్లు ఉన్నాయని అన్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా తన శాఖను నిర్వహిస్తున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ సైతం మహిళలు స్వతంత్రంగా ఉండాలని ఇటీవల పిలుపునిచ్చారని అన్నారు.

రామ మందిర్ ట్రస్ట్ తొలి CEOగా జితేంద్ర మిశ్రా!
National· 2d ago

రామ మందిర్ ట్రస్ట్ తొలి CEOగా జితేంద్ర మిశ్రా!

అయోధ్య రామ మందిర్ ట్రస్ట్‌కు తొలి <a href="https://www.indiatvnews.com/news/india/air-marshal-jeetendra-mishra-to-be-first-ceo-of-ayodhya-ram-temple-trust-latest-updates-2026-09-02-1053071">Chief Executive Officer (CEO)</a>గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా సెలెక్ట్ అయ్యారు. ఈరోజు జరిగిన ట్రస్ట్ కీలక మీటింగ్‌లో ఈ డెసిషన్ తీసుకున్నారు. మొత్తం 5,585 అప్లికేషన్స్ రాగా, చివరకు ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేశారు. వారిలో జితేంద్ర మిశ్రాను ఎంపిక చేశారు. టెంపుల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, లీగల్ విషయాలు, డెవలప్‌మెంట్ పనులను ఆయన చూసుకోనున్నారు. ఆలయ పనితీరును మరింత పకడ్బందీగా నిర్వహించడమే ఈ పదవి ఉద్దేశమని ట్రస్ట్ తెలిపింది.

నాగర్కర్నూల్‌కి కొత్త డీఈ..
Local· 2d ago

నాగర్కర్నూల్‌కి కొత్త డీఈ..

నాగర్కర్నూల్ జిల్లా విద్యుత్ శాఖకు కొత్త డివిజనల్ ఇంజనీర్ వచ్చేశారు. DE ఎం.సుధాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన హైదరాబాద్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. 327 యూనియన్ నాయకులు ఆయన ఛాంబర్‌లో కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి కంగ్రాట్స్ చెప్పారు. యూనియన్ నాయకులు లక్ష్మయ్య, నిరంజన్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు ఆయన్ను కలిసిన వారిలో ఉన్నారు.

వార్ సైరన్.. ఉక్రెయిన్లో జగిత్యాల వాసి మృతి!
Local· 2d ago

వార్ సైరన్.. ఉక్రెయిన్లో జగిత్యాల వాసి మృతి!

జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ (42) ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందారు. కుటుంబ పోషణ కోసం కంపెనీ వీసాపై 4 నెలల క్రితం ఆయన అక్కడికి వెళ్లి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి రష్యా డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. వార్ సైరన్ మోగడంతో ఆయన రూమ్ నుంచి బయటకు పరిగెత్తారు. దురదృష్టవశాత్తూ.. ఆయన వెళ్తున్న దిశలోనే క్షిపణి పడిపోయింది! ఆ దాడిలో 12 మంది మృతి చెందారు. ఆ దాడిలో మరో జగిత్యాల వాసి మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఖమ్మంలో వాన దంచికొడుతోంది.. రాత్రికి అలర్ట్!
Local· 2d ago

ఖమ్మంలో వాన దంచికొడుతోంది.. రాత్రికి అలర్ట్!

ఖమ్మం నగరంలో మధ్యాహ్నం 2:40 నుంచి వర్షం దంచి కొడుతోంది. ఉదయం చిరుజల్లులు పడ్డాయి.. తర్వాత ఎండతో ఉబ్బ తీసింది. ఇప్పుడు మాత్రం వాన సెలవు ప్రకటించింది.. అంటే కాస్త ఆగింది! కానీ వాతావరణ శాఖ మాత్రం రాత్రి 8 గంటల తర్వాత మళ్ళీ వర్షం పెరగొచ్చని చెప్తోంది. ఖమ్మం వాసులు అప్రమత్తంగా ఉండాలి. రాత్రివేళ బయటకు రాకండి.. సురక్షితంగా ఉండండి!

CM రేవంత్‌పై మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్!
TG· 2d ago

CM రేవంత్‌పై మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్!

TG: మీడియాతో మంత్రి కొండా సురేఖ CM రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై యాక్షన్ తీసుకునే ముందు CMపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. రేవంత్ 10 ఏళ్ల పాటు తానే CM అని చెప్పుకుంటున్నారని అన్నారు. CMపై మంత్రులు, నేతల్లోనూ అసంతృప్తి ఉందని చెప్పారు. BCలకు ఓ రూల్, ఇతర సామాజిక వర్గాలకు మరో రూలా? అని ప్రశ్నించారు. ఖర్గేను కలిశానని, వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదు అన్నారు. పార్టీ హైకమాండ్‌కు అన్ని విషయాలను రాతపూర్వకంగా వివరించానని అన్నారు. వారితో నన్ను పదవిలో కొనసాగించమని కోరినట్లు మీడియాకు తెలిపారు.

420 హామీలు.. కోరుట్లలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ!
Local· 2d ago

420 హామీలు.. కోరుట్లలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ!

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాస్త 420 హామీలుగా మారిపోయాయంటూ 420 అడుగుల ఫ్లెక్సీతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలననే గొప్పదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత పాల్గొన్నారు. "రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి" అంటూ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశాయి.

మహిళలకి హైకోర్టు గుడ్ న్యూస్!
National· 2d ago

మహిళలకి హైకోర్టు గుడ్ న్యూస్!

ప్రెగ్నెన్సీ తర్వాత ఆఫీస్‌కి వచ్చే మహిళలకు ఢిల్లీ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. మెటర్నిటీ లీవ్ తర్వాత వచ్చే ఉమెన్ ఎంప్లాయ్స్‌కి మునుపటి పొజిషన్, సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలని, కెరీర్ గ్రోత్‌కి ప్రాబ్లం రానివ్వకూడదని స్పష్టం చేసింది. వర్క్‌ప్లేస్ సపోర్ట్, ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కోసం 6 నెలల్లోగా స్పెషల్ రూల్స్ తేవాలని సెంట్రల్ గవర్నమెంట్‌ని ఆదేశించింది. ప్రైవేట్ కంపెనీల్లోనూ ఈ రూల్స్ పక్కాగా వర్తిస్తాయని జస్టిస్ సచిన్ దత్తా చెప్పారు.

డిజాస్టర్ అవగాహన.. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు శిక్షణ!
Local· 2d ago

డిజాస్టర్ అవగాహన.. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు శిక్షణ!

బాపట్ల జిల్లా వేమూరు మండలం తెల్లవారి గ్రామంలో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అవగాహన సెషన్ నిర్వహించారు. పెరవల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, కార్డ్ సిబ్బంది ఎం.శ్రీనివాసరావు, పి.సురేఖ, ఆర్.అనిత విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. విపత్తులు వచ్చినప్పుడు ఎలా రక్షించుకోవాలో పీపీటీ ద్వారా నేర్పించారు. కార్డ్ సంస్థ ఇప్పటికే 5 మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ప్రమాదం
TG· 2d ago

కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ప్రమాదం

TG: కరీంనగర్ జిల్లాలో బస్సుకు ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. బస్సు బావిలోకి పడకుండా ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొని బయటపడ్డారు.

స్కాలర్‌షిప్ అప్లికేషన్ గడువు పొడిగింపు
Education· 2d ago

స్కాలర్‌షిప్ అప్లికేషన్ గడువు పొడిగింపు

కేంద్ర విద్యాశాఖ నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(NMMSS) 2026-27 అకడమిక్ సంవత్సరానికి అప్లికేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ <a href="https://scholarships.gov.in/">పోర్టల్</a> ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 9వ క్లాసులో కొత్తగా లక్ష మంది మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. 10, 11, 12వ క్లాసుల్లో ప్రోగ్రెస్ ఆధారంగా రెన్యూవల్ చేస్తారు. ఒక్కో స్టూడెంట్‌కి ఏడాదికి రూ.12,000 స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

నీట్ ప్రొటెస్టర్స్ సక్సెస్: కేసులన్నీ క్లోస్!
National· 2d ago

నీట్ ప్రొటెస్టర్స్ సక్సెస్: కేసులన్నీ క్లోస్!

నీట్ 2026 ప్రొటెస్టర్లపై ఉన్న అన్ని FIRలను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టేసింది. జంతర్ మంతర్ నిరసనల టైమ్‌లో దేశవ్యాప్తంగా నమోదైన పాత కేసులను రద్దు చేయడంతో పాటు, ఫ్యూచర్‌లో కొత్తగా ఎలాంటి కేసులు పెట్టకూడదని ఆర్డర్ వేసింది. అలాగే, నీట్ బాధితుల ఫ్యామిలీస్‌కి 90 రోజుల్లోగా కాంపెన్సేషన్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. లీగల్ పోరాటంలో తమ డిమాండ్స్ అన్నీ నెరవేరడంతో బాధితులకు కంప్లీట్ జస్టిస్ దక్కిందని CJP లాయర్ రత్నసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు.

పాకాలలో అరుదైన వైట్-ఐడ్ బజార్డ్ సందడి!
Local· 2d ago

పాకాలలో అరుదైన వైట్-ఐడ్ బజార్డ్ సందడి!

పాకాలకు కొత్త చుట్టం వచ్చింది. దక్షిణాసియాలో అక్కడక్కడ కనిపించే అరుదైన పక్షి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల పార్కులో కనిపించింది. అదే వైట్-ఐడ్ బజార్డ్. బుధవారం ఈ జువైనైల్ పక్షిని సందర్శకులు గుర్తించారు. ఎకో టూరిజం వాచర్ జయప్రకాష్ ఫోన్‌లో ఫొటో తీశారు. గోధుమ కళ్లు, తెల్లని నుదురు - ఇవి ఈ చిన్న బర్డ్ స్పెషల్ ఐడెంటిటీ! ఇది మిడతలు, బల్లులు, కప్పలు తింటుంది. పాకాల ఎకో టూరిజం ఇప్పుడు బర్డ్ వాచర్స్ హాట్‌స్పాట్ గా అభివృద్ధి అవుతోంది. పర్యావరణాన్ని కాపాడితే ఇలాంటి సర్‌ప్రైజెస్ ఎన్నో చూడొచ్చు.

ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. APలో 917, తెలంగాణలో 419 ఖాళీలు
Jobs· 2d ago

ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. APలో 917, తెలంగాణలో 419 ఖాళీలు

ఇండియా పోస్ట్‌లో (GDS, BPM, ABPM) 25,000+ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10th క్లాస్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఏజ్ 18–40 ఏళ్లు మధ్య ఉండాలి. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19 లోపు చేసుకోవాలి. అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ కాగా, ఈనెల 21తో ముగుస్తాయి. మేల్ జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. SC/ST/PwD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. సెలెక్షన్ 10th క్లాస్ (SSC) మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ కోసం ఇక్కడ <a href="https://www.indiapost.gov.in/gdsonlineengagement">Click </a>చేయండి.