హైదరాబాద్‌కు 'ట్రంప్' టవర్స్

TG : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ప్రముఖ 'ట్రంప్ ఆర్గనైజేషన్' అడుగుపెట్టింది. ట్రెబెకా డెవలపర్స్, స్థానిక ఇరా రియల్టీ భాగస్వామ్యంతో కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్డులోని 4 ఎకరాల్లో 65 అంతస్తులతో రెండు ట్రంప్ టవర్లను నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రూ.1,800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టులో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు, 16 పెంట్ హౌస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.



